Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

తాళ్లపూడి మండలంలో హై అలర్ట్, గజ్జరం-అన్నదేవరపేట మధ్య రోడ్డు దాటిన పులి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తాళ్లపూడి మండలంలో హై అలర్ట్, గజ్జరం-అన్నదేవరపేట మధ్య రోడ్డు దాటిన పులి

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా, తాళ్ళపూడి మండలం, అక్టోబర్ -8 (పున్నమి ప్రతినిధి) తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండల పరిధిలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
  • గజ్జరం మరియు అన్నదేవరపేట గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారిని పులి దాటినట్లు అటవీ శాఖ అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు.
  • మరియు రహదారి దాటిన పులి ప్రస్తుతం పొలాల మీదుగా వేగేశ్వరపురం గ్రామం వైపునకు కదులుతున్నట్లు అధికారులు గుర్తించారు.

తూర్పుగోదావరి జిల్లా, తాళ్ళపూడి మండలం, అక్టోబర్ -8 (పున్నమి ప్రతినిధి) తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండల పరిధిలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. గజ్జరం మరియు అన్నదేవరపేట గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారిని పులి దాటినట్లు అటవీ శాఖ అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. మరియు రహదారి దాటిన పులి ప్రస్తుతం పొలాల మీదుగా వేగేశ్వరపురం గ్రామం వైపునకు కదులుతున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ ఏర్పాటు చేసిన జీపీఎస్ (GPS) ట్రాక్ కెమెరాల ఆధారంగా పులి కదలికలను నిరంతరం నిఘా ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. పులి సంచార నేపథ్యంలో తాళ్లపూడి, వేగేశ్వరపురం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు, కూలీలు ఎవరూ ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని, రాత్రి వేళల్లో ప్రయాణాలు తగ్గించుకోవాలని హెచ్చరించారు. పులిని పట్టుకునేందుకు అటవీ సిబ్బంది క్షేత్రస్థాయిలో చర్యలు ముమ్మరం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *