వార్త ముఖ్యాంశాలు
- పెద్దారెడ్డి ఇంటిపై దాడి – పది వాహనాలు ధ్వంసం, 20 బైకులకు నిప్పు అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
- మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు.
- ఈ ఘటనలో పెద్దారెడ్డికి చెందిన సుమారు పది వాహనాలు ధ్వంసం కాగా, 20 ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టినట్లు సమాచారం.
పెద్దారెడ్డి ఇంటిపై దాడి – పది వాహనాలు ధ్వంసం, 20 బైకులకు నిప్పు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలో పెద్దారెడ్డికి చెందిన సుమారు పది వాహనాలు ధ్వంసం కాగా, 20 ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టినట్లు సమాచారం. ఇంటి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. ఘటన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ హింసాత్మక ఘటనలతో తనకు సంబంధం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్