Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తల్లికి వందనం డబ్బులు తీసుకొస్తానని వెళ్లి అదృశ్యం.. ఇద్దరు చిన్నారులు తల్లి కోసం ఎదురుచూపులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తల్లికి వందనం డబ్బులు తీసుకొస్తానని వెళ్లి అదృశ్యం.. ఇద్దరు చిన్నారులు తల్లి కోసం ఎదురుచూపులు

వార్త ముఖ్యాంశాలు

  • *రెండేళ్ల కుమార్తెతో యువతి మాయం..
  • ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల వేడుకోలు* *తల్లి కోసం విలవిలలాడుతున్న ఇద్దరు పిల్లలు..
  • టి.

*రెండేళ్ల కుమార్తెతో యువతి మాయం.. ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల వేడుకోలు*

*తల్లి కోసం విలవిలలాడుతున్న ఇద్దరు పిల్లలు.. టి. లక్ష్మి జాడ తెలిపాలని బంధువుల విజ్ఞప్తి*

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన టి. లక్ష్మి (26) అనే యువతి తన రెండేళ్ల కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మి, ” తల్లికి వందనం” పథకం డబ్బులు తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లినట్లు బంధువులు వెల్లడించారు. అనంతరం ఆ డబ్బులను డ్రా చేసి ఎక్కడికి వెళ్లిందో తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

లక్ష్మికి ముగ్గురు పిల్లలు ఉండగా, వారిలో ఇద్దరు చిన్నారులు ప్రస్తుతం తల్లి కోసం విలవిలలాడుతున్నారని బంధువులు తెలిపారు. ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలు నాయుడుపేట ఎస్టీ కాలనీలో ఉన్నట్లు సమాచారం.
లక్ష్మి ఆచూకీ తెలిసిన వారు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరికైనా సమాచారం ఉంటే 9912490051 లేదా 728606078 నంబర్లకు సంప్రదించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *