వార్త ముఖ్యాంశాలు
- తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, మే 26: తాళ్లపూడి మండలం తాళ్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలో డ్రైనేజీల సమస్యలపై వచ్చిన వార్తలకు స్పందిస్తూ గ్రామ పంచాయతీ సెక్రెటరీ సుభద్ర చర్యలు చేపట్టారు.
- సోమవారం ఉదయం తాళ్లపూడి ఎస్సీ ఏరియాలో డ్రైనేజీలను శుభ్రపరచించినట్లు ఆమె తెలిపారు.
- రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీలను మరింత లోతుగా తవ్వించి, వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, మే 26: తాళ్లపూడి మండలం తాళ్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలో డ్రైనేజీల సమస్యలపై వచ్చిన వార్తలకు స్పందిస్తూ గ్రామ పంచాయతీ సెక్రెటరీ సుభద్ర చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం తాళ్లపూడి ఎస్సీ ఏరియాలో డ్రైనేజీలను శుభ్రపరచించినట్లు ఆమె తెలిపారు.
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీలను మరింత లోతుగా తవ్వించి, వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామంలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా ప్రతిరోజూ పారిశుధ్య కార్మికులతో చెత్త తొలగింపు పనులు నిర్వహిస్తూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పంచాయతీ తరఫున అవసరమైన చర్యలు కొనసాగుతాయని సెక్రెటరీ సుభద్ర స్పష్టం చేశారు.