Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం.. రాగి వైర్లు, ఆయిల్ చోరీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం.. రాగి వైర్లు, ఆయిల్ చోరీ

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా, తాళ్ళపూడి మండలం, అక్టోబర్ -08 (పున్నమి ప్రతినిధి) తాళ్లపూడి మండల పరిధిలో గుర్తుతెలియని దుండగులు బరితెగించి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడమే కాకుండా చోరీకి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
  • చింతలపూడి ఎత్తిపోతల పథకం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను కొందరు దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు.
  • అర్ధరాత్రి వేళ పూర్తిగా ధ్వంసం చేశారు.

తూర్పుగోదావరి జిల్లా, తాళ్ళపూడి మండలం, అక్టోబర్ -08 (పున్నమి ప్రతినిధి) తాళ్లపూడి మండల పరిధిలో గుర్తుతెలియని దుండగులు బరితెగించి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడమే కాకుండా చోరీకి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చింతలపూడి ఎత్తిపోతల పథకం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను కొందరు దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. అర్ధరాత్రి వేళ పూర్తిగా ధ్వంసం చేశారు. అనంతరం అందులో ఉండే అత్యంత విలువైన రాగి వైండింగ్ వైర్ మరియు ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్ను దొంగిలించుకొని పరారయ్యారు. ఉదయం గమనించిన స్థానికులు, అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ పగటిదొంగతనం మరియు ప్రభుత్వ ఆస్తి నష్టంపై తాళ్లపూడి పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులపై బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 303(2) తో పాటు, విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 136(1) కింద కేసులు నమోదు చేసినట్లు అధికారికంగా తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం మరియు చోరీకి పాల్పడిన ఆ గుర్తుతెలియని వ్యక్తులను త్వరితగతిన పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *