నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 51 రోజులపాటు 51 ప్రాంతాల్లో జెన్-జీ యువతతో ఆత్మీయ భేటీలు నిర్వహిస్తూ దాదాపు 20 వేల మంది విద్యార్థులను నేరుగా కలిశారు. పార్థసారథి నగర్లోని జెనెక్స్ కాలేజీలో సుమారు 1000 మంది విద్యార్థులతో నాలుగు గంటలపాటు సమావేశమయ్యారు. యువత ప్రశ్నించే తత్వం సమాజానికి అవసరమని పేర్కొన్నారు. వారి ఆకాంక్షలు, మనోభావాలను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని, జెన్-జీ ఆశయాలకు అనుగుణంగా శాసనసభ్యుడిగా పనిచేస్తానని తెలిపారు.







