Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో జ్ఞాన్ విహార్ విద్యార్థుల సత్తా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో జ్ఞాన్ విహార్ విద్యార్థుల సత్తా

జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో జ్ఞాన్ విహార్ విద్యార్థుల సత్తా

కడప, సెప్టెంబర్ 29 (పున్నమి ప్రతినిధి):

కడప పట్టణంలోని మహావీర్ సర్కిల్‌లో ఉన్న జ్ఞాన్ విహార్ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. కడప జిల్లా పాఠశాలల ఆటల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే, బాక్సింగ్, చెస్, కబడ్డీ, బ్యాడ్మింటన్ తదితర క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ పోటీల్లో 9వ తరగతికి చెందిన అఖిల్ కుమార్ తేజ్, అశ్వద్ధామ, ధీరజ్, లక్ష్మీ నిహాంత్, 8వ తరగతికి చెందిన అజయ్ కృష్ణారెడ్డి వివిధ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించారు. ముఖ్యంగా బాక్సింగ్, టంట్కా విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ చాటి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు, పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సువర్ణ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు శిక్షణ అందించిన పాఠశాల కరాటే మాస్టర్ వెంకట్‌ను అభినందించారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, జట్టుగా పనిచేసే నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు.

పాఠశాల చైర్మన్ సుధాకర్, కరస్పాండెంట్ డా. రవి శంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యతో పాటు క్రీడల్లోనూ సమానంగా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. విద్యార్థులు సాధించిన విజయాలు పాఠశాలకు గర్వకారణమని, ఈ విజయాలు ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో జ్ఞాన్ విహార్ విద్యార్థుల సత్తా

జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో జ్ఞాన్ విహార్ విద్యార్థుల సత్తా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *