Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

శనగ విత్తనాల నాణ్యత పరిశీలన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శనగ విత్తనాల నాణ్యత పరిశీలన

(పున్నమి ప్రతినిధి)
వేముల మండలం: వేముల రైతు సేవా కేంద్రంలో సరఫరా చేసిన శనగ విత్తనాల నాణ్యతను సహాయ వ్యవసాయ సంచాలకులు పులివెందుల ప్రభాకర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి జి.పి. ఓబులేసు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వేముల మండలానికి 19,00 క్వింటాళ్ల శనగ విత్తనాలు మంజూరయ్యాయని తెలిపారు. రైతులకు 35 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. పూర్తి ధర క్వింటాల్‌కు రూ.9,000 కాగా, సబ్సిడీ రూ.3,150, రైతు వాటా రూ.5,850 ఉంటుందని తెలిపారు. రైతులు ఆధార్ కార్డు, ఫోన్ నంబర్, పట్టాదారు పాస్‌బుక్‌తో సంబంధిత రైతు సేవా కేంద్రానికి వచ్చి విత్తనాలు పొందాలని సూచించారు.

శనగ విత్తనాల నాణ్యత పరిశీలన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *