Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

జిల్లా సంజీవని నిధికి స్వచ్ఛంద విరాళాలు అందించాలి*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జిల్లా సంజీవని నిధికి స్వచ్ఛంద విరాళాలు అందించాలి*

వార్త ముఖ్యాంశాలు

  • *జిల్లా సంజీవని నిధికి స్వచ్ఛంద విరాళాలు అందించాలి* *అధికారుల‌కు, దాత‌ల‌కు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి *విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి * జిల్లాలోని పేద‌ల‌కు, అనారోగ్య బాధితుల‌కు సాయం చేయాల‌నే దృక్ప‌థంతో నెల‌కొల్పిన సంజీవ‌ని నిధి - డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్ కు స్వ‌చ్ఛంద విరాళాలు అందించాలని,…
  • హ‌రేంధిర ప్రసాద్ విజ్ఞ‌ప్తి చేశారు.
  • నూతన సంవత్సరం - 2026కు స్వాగతం పలికే సందర్భంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న మానవీయమైన, అర్థవంతమైన సంప్రదాయాన్ని ఈ ఏడాదీ కొనసాగించాలని విన్న‌వించారు.

*జిల్లా సంజీవని నిధికి స్వచ్ఛంద విరాళాలు అందించాలి*

*అధికారుల‌కు, దాత‌ల‌కు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి

*విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి * జిల్లాలోని పేద‌ల‌కు, అనారోగ్య బాధితుల‌కు సాయం చేయాల‌నే దృక్ప‌థంతో నెల‌కొల్పిన సంజీవ‌ని నిధి – డిస్ట్రిక్ట్ రిలీఫ్ ఫండ్ కు స్వ‌చ్ఛంద విరాళాలు అందించాలని, అధికారుల‌ను, దాత‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్రసాద్ విజ్ఞ‌ప్తి చేశారు. నూతన సంవత్సరం – 2026కు స్వాగతం పలికే సందర్భంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న మానవీయమైన, అర్థవంతమైన సంప్రదాయాన్ని ఈ ఏడాదీ కొనసాగించాలని విన్న‌వించారు. అధికారులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలపడం సందర్భంగా పూలు, పండ్లు, కేకులు, మొక్కలు తదితరాలను అందించడం కన్నా.. ‘సంజీవని నిధి – జిల్లా సహాయ నిధి’కి స్వచ్ఛంద విరాళాలు అందించాలని ప్ర‌త్యేక సందేశం ద్వారా సోమ‌వారం విజ్ఞప్తి చేశారు. ‘సంజీవని నిధి – జిల్లా సహాయ నిధి’ ద్వారా సేకరించిన విరాళాలు జిల్లాలోని అవసరమైన, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించడంలో ఎంతో ఉపయోగపడుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ మానవీయ కార్యక్రమంలో భాగస్వాములు కావడం ద్వారా, సమాజంలో బాధితులకు అండ‌గా నిల‌వ‌డంతో పాటు, సామాజిక బాధ్యతకు ఆదర్శంగా నిలవగలమని ఆయన పేర్కొన్నారు. ఈ విరాళాలు పూర్తిగా స్వచ్ఛందమైనవని స్పష్టం చేస్తూ, సేవాభావంతో నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దామని జిల్లా క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు.

విరాళాలకు సంబంధించిన‌ వివరాలు:

నిధి పేరు: SANJEEVANI NIDHI – District Relief Fund
ఖాతా సంఖ్య: 50100500766040
బ్యాంకు & IFSC: HDFC Bank – HDFC0009179

Leave a comment

Your email address will not be published. Required fields are marked *