Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

జిల్లా కలెక్టర్ తో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ భేటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జిల్లా కలెక్టర్ తో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ భేటీ

వార్త ముఖ్యాంశాలు

  • జిల్లా కలెక్టర్ తో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ భేటీ మార్కాపురం: 2.10.26: హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (హెచ్ డి పి టి) గౌరవ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రం కలెక్టరేట్‌లో,…
  • విజయ సునీత మరియు జాయింట్ కలెక్టర్ పి.
  • శ్రీనివాసులులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

జిల్లా కలెక్టర్ తో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ భేటీ

మార్కాపురం: 2.10.26:

హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (హెచ్ డి పి టి) గౌరవ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రం కలెక్టరేట్‌లో, కలెక్టర్ ఎం. విజయ సునీత మరియు జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో కలెక్టర్ ఎం. విజయ సునీత నేతృత్వంలో గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో నిర్వహించనున్న క్షేత్ర స్థాయి పరిశోధనా అధ్యయనం (Field Research Study) పై చర్చించారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏ ఎస్ సి ఐ) భాగస్వామ్యంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు సమగ్ర ప్రణాళికను, పర్యటన వివరాలను కలెక్టర్‌తో చైర్మన్ చర్చించారు.

జిల్లా పర్యటనలో భాగంగా రేపు (అక్టోబర్ 3) డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డి ఎఫ్ ఓ) సమన్వయంతో పరిశోధనా అధ్యాయానికి సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టనున్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, మార్కాపురం వారిచే జారీ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *