Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. నరసింహమూర్తి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. నరసింహమూర్తి

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.
  • నరసింహమూర్తి పిలుపునిచ్చారు.
  • సత్వర న్యాయంతోపాటు సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు.

నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. నరసింహమూర్తి పిలుపునిచ్చారు. సత్వర న్యాయంతోపాటు సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. జిల్లాలో 22,988 సివిల్, 29,742 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాజీకి అవకాశం ఉన్న సివిల్, క్రిమినల్, ప్రీ-లిటిగేషన్ కేసులను లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఈ ఏడాది మార్చి 14, జూలై 11న జరిగిన అదాలత్‌లలో 1,19,676 కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. బ్యాంకు, మున్సిపల్, నీటి, బీఎస్‌ఎన్‌ఎల్ బకాయిల కేసులను దావా దశకు ముందే పరిష్కరించుకోవచ్చన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సంపూర్ణంగా సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వై.జె. పద్మశ్రీ, డీఆర్వో ఎన్. విజయకుమార్, అదనపు ఎస్పీ సీహెచ్ సౌజన్య, కమిషనర్ వై.ఓ. నందన్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *