Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

జనసేన కమిటీలో దళితులకు చోటు కల్పించాలి మండల నియోజకవర్గ ఎంపీటీసీ జడ్పిటిసి మున్సిపాలిటీ సర్పంచ్ దళితులకు చోటు కల్పించాలి పులిపాక పులిపాక ప్రకాష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జనసేన కమిటీలో దళితులకు చోటు కల్పించాలి మండల నియోజకవర్గ ఎంపీటీసీ జడ్పిటిసి మున్సిపాలిటీ సర్పంచ్ దళితులకు చోటు కల్పించాలి పులిపాక పులిపాక ప్రకాష్

జనసేన పార్టీ ఉందా? లేదా?

ఎన్నికల కమిటీలతో ఎవరికి ప్రయోజనం..?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ వ్యవహారశైలిపై పులిపాక ప్రకాష్ ప్రశ్నలు సంధించారు. ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల వల్ల పార్టీకి, ప్రజలకు ఏం ప్రయోజనం కలుగుతుందని ఆయన ప్రశ్నించారు.

గుంటూరు జిల్లాలో జనసేనకు సంబంధించిన ఎస్సీ యువకుడి లాకప్ మరణం ఘటనపై పార్టీ ఎందుకు స్పందించడం లేదని పులిపాక ప్రకాష్ నిలదీశారు. ఒక యువకుడి మరణంపై పార్టీ నాయకత్వం స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. మైలవరం నియోజకవర్గంలో దళితులకు చోటు ఎక్కడ కల్పించారో చెప్పాలి అన్నగారిన బడుగు బలహీన వర్గాలకి జనసేనలో న్యాయం జరగట్లేదు జనసేన కోసం కష్టపడి పనిచేసిన గుంటూరు జిల్లా చీకటి గోపి చనిపోతే ఇంతవరకు జనసేన మాట్లాడిన దాఖలాలు లేవు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదు మంత్రి నాదెండ్ల మనోహర్ గూడా ఇంతవరకు ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు చీకటి గోపి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించాలని ఆ కుటుంబానికి అండగా ఉండాలని పులిపాక ప్రకాష్ మాట్లాడారు జనసేన కమిటీల్లో జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ మండల కమిటీ నియోజకవర్గ కమిటీల్లో దళితులకు స్థానం కల్పించాలి

అలాగే కృష్ణా మాదిగ అడిగిన ప్రశ్నలకు జనసేన పార్టీ సమాధానం చెప్పగలదా? అని పులిపాక ప్రకాష్ ప్రశ్నించారు. కృష్ణా మాదిగ లేవనెత్తిన అంశాలపై పార్టీ నాయకత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

“జనసేన పార్టీ ప్రజా సమస్యలపై స్పందిస్తుందా? లేదా ఎన్నికల సమయంలో మాత్రమే కమిటీలు ఏర్పాటు చేయడానికే పరిమితమవుతుందా?” అంటూ పులిపాక ప్రకాష్ ప్రశ్నించారు.

ఎస్సీ యువకుడి లాకప్ మరణం అంశంపై జనసేన పార్టీ అధికారికంగా స్పందించి, తమ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జనసేన కమిటీలో దళితులకు చోటు కల్పించాలి మండల నియోజకవర్గ ఎంపీటీసీ జడ్పిటిసి మున్సిపాలిటీ సర్పంచ్ దళితులకు చోటు కల్పించాలి పులిపాక పులిపాక ప్రకాష్

జనసేన కమిటీలో దళితులకు చోటు కల్పించాలి మండల నియోజకవర్గ ఎంపీటీసీ జడ్పిటిసి మున్సిపాలిటీ సర్పంచ్ దళితులకు చోటు కల్పించాలి పులిపాక పులిపాక ప్రకాష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *