Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ఆహ్వానం

వార్త ముఖ్యాంశాలు

  • జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ఆహ్వానించారు.కడప జిల్లా, కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పెండ్లిమర్రి సభ ప్రాంగణంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు & కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు,…
  • రాష్ట్రం నలుమూలల నుండి, దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు కడపకు పెద్ద సంఖ్యలో విచ్చేసే ఈ మహా ఐక్య కార్యక్రమం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మరియు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా సూచించారు.
  • కడప జిల్లాలో దీనీ ఇస్తిమా నిర్వహణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, భద్రత, రవాణా, వసతి, పారిశుద్ధ్యం వంటి అన్ని కీలక అంశాలను సమన్వయంతో పర్యవేక్షిస్తూ ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికే ప్రారంభించినట్లు శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు.

జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ఆహ్వానించారు.కడప జిల్లా, కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పెండ్లిమర్రి సభ ప్రాంగణంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు & కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు, కడప ముస్లిం పెద్దలతో కలిసి 2026 జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ఆహ్వానించారు.

రాష్ట్రం నలుమూలల నుండి, దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు కడపకు పెద్ద సంఖ్యలో విచ్చేసే ఈ మహా ఐక్య కార్యక్రమం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మరియు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా సూచించారు.

కడప జిల్లాలో దీనీ ఇస్తిమా నిర్వహణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, భద్రత, రవాణా, వసతి, పారిశుద్ధ్యం వంటి అన్ని కీలక అంశాలను సమన్వయంతో పర్యవేక్షిస్తూ ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికే ప్రారంభించినట్లు శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *