Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనగణన గృహ నమోదు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి: తహసీల్దార్ రమాదేవి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జనగణన గృహ నమోదు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి: తహసీల్దార్ రమాదేవి

వార్త ముఖ్యాంశాలు

  • ఈ యొక్క నెల్లూరు జిల్లా జూన్ 3 (పున్నమి ప్రతినిధి) జనగణనలో భాగంగా జరుగుతున్న గృహ నమోదు కార్యక్రమాన్ని ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని తహసీల్దార్ రమాదేవి సూచించారు.
  • బుధవారం మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
  • మనుబోలు మండలం ప్రస్తుతం గృహ నమోదులో పెండింగ్ జాబితాలో మూడో స్థానంలో ఉందని తెలిపారు.

ఈ యొక్క నెల్లూరు జిల్లా జూన్ 3 (పున్నమి ప్రతినిధి)
జనగణనలో భాగంగా జరుగుతున్న గృహ నమోదు కార్యక్రమాన్ని ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని తహసీల్దార్ రమాదేవి సూచించారు. బుధవారం మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మనుబోలు మండలం ప్రస్తుతం గృహ నమోదులో పెండింగ్ జాబితాలో మూడో స్థానంలో ఉందని తెలిపారు. గ్రామాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లు, ఖాళీగా ఉన్న గృహాల వివరాలను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. నమోదు తక్కువగా ఉన్న గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్ఓ కేవీఎస్ గాయత్రి, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *