Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

జంగాలపల్లిలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

మండలంలోని జంగాలపల్లి గ్రామంలో గురువారం ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.రాజంపేట నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్‌ చమర్తి జగన్మోహన్‌రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ దారపునేని దశరధ రామానాయుడు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు పింఛన్‌ నగదును స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా దారపునేని దశరధ రామానాయుడు మాట్లాడుతూ పేదలు, వృద్ధులు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పింఛన్ల ద్వారా వృద్ధులు, వితంతువులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

జంగాలపల్లిలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *