చాగలేరు అంగన్వాడీ కేంద్రాల్లో ఉత్సవం
(పున్నమి ప్రతినిధి) వేముల అక్టోబర్ 5: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ప్రజా సంకల్ప అభియాన్‌లో భాగంగా చాగలేరు 1, 2వ అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులకు ఐసీడీఎస్ సూపర్వైజర్ పోషకాహారంపై అవగాహన కల్పించారు. నువ్వులు, బెల్లం, ఆకుకూరలను ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవాలని సూచించారు. పిల్లలకు వైవిధ్యమైన ఆహారం అందించాలని తెలిపారు. మిషన్ వాత్సల్య, ప్రధానమంత్రి మాతృ వందన యోజనపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథులు ఈశ్వర్ రెడ్డి, సౌభాగ్య, తిరుపాల్ రెడ్డి అంగన్వాడీ సేవలు, సమతుల్య ఆహారం, పూర్వప్రాథమిక విద్య ప్రాధాన్యతను వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు శివలక్ష్మి, సులోచన, సహాయకురాలు శిరీష, శివలింగంను సన్మానించారు. గ్రామ పెద్దలు మల్లికార్జున్ రెడ్డి, శివరామిరెడ్డి, రెడ్డయ్య, శ్రీనివాస రెడ్డి, ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
