Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

ఛలో హైదరాబాద్ఇందిరా పార్కె మహాధర్నా కు భారీ తరలింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

ఛలో హైదరాబాద్ ఇందిరా పార్క్ మహాధర్నా కు భారీ తరలింపు :బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్
—————————————————————–
జనగామ, సెప్టెంబర్ 5,పున్నమి పున్నమి జిల్లా ప్రతినిధి :
ఈరోజు భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ మహాధర్నా కు భారీ గా తరలి వెళ్లడం జరిగింది.
ఈ సందర్భంగా సౌడ రమేష్ మాట్లాడుతూ 22 ఏ నిషేధిత జాబితాలో మధ్యతరగతి ప్రజల ప్రైవేటు భూములు రైతుల భూములు నిరుపేదలకు సంబంధించి 50 100 గజాల స్థలాలు కూడా 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని సుమారు 50 లక్షల మంది సామాన్య పేద ప్రజలు రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని 22 ఏ నిషేధిత జాబితాలో అక్రమంగా పేదల భూములు చేర్చి రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపిందని 22 ఏ నిషేధిత భూములలో ప్రజలకు న్యాయం జరిగే వరకూ బిజెపి హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద బిజెపి ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు మహాదరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయకపోతే బిజెపి అనేక ఆందోళన కార్యక్రమాలు చేసి ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు పోడుగుల రమేష్ బల్ల శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పల్లె కుమార్ యువ మోర్చా అధ్యక్షులు హరీష్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవి మండల అధ్యక్షులు మైపాల్ మహిళా మోర్చా నాయకులు ఎనగందుల కళ్యాణి మూటకొండూరు రమాదేవి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి ఎస్సీ మోర్చా అధ్యక్షులు బందారపు యాదగిరి మండల అధ్యక్షులు ఉదయ్ రెడ్డి సంజీవ్ మండల దూల్మిట్ట అధ్యక్షులు కోడం యాదగిరి తదితరులు పాల్గొన్నారు

ఛలో హైదరాబాద్ఇందిరా పార్కె మహాధర్నా కు భారీ తరలింపు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *