Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

చిన్నారుని వైద్యానికి లక్షా ఏభై వేలు ఆర్ధికసాయం – ఆపదలో ఉండేవారికి చేయూతనిద్దాం – ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ మార్పు.విజయకుమార్(నరసన్నపేట – )

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఆపదలో ఉండేవారికి చేయూతనిద్దామని ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ మార్పు.విజయకుమార్ శనివారం అన్నారు.
  • శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట స్థానిక ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్న నాగరాజు, మీనా దంపతుల కుమారుడు శ్యాంచరణ్ నిరుపేద కుటుంబానికి చెందినవాడని, బ్రతుకుతెరువు కోసం నాగరాజు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా, కుమారుడు కె.శ్యాంచరణ్ కు ఇటీవలే జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు.
  • చిన్నారుడు ఈదులవలస మోడల్ పాటశాలలో 6 వ తరగతి చదువుతున్నారని, ఆటోలో పాఠశాలకు వెళుతుండగా జరిగిన ప్రమాదంలో కాళ్లు చేతులు, కాలర్ బోన్ విరిగి పోవడంతో, తలకు తీవ్రమైన గాయాలయ్యాయన్నారు.

ఆపదలో ఉండేవారికి చేయూతనిద్దామని ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ మార్పు.విజయకుమార్ శనివారం అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట స్థానిక ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్న నాగరాజు, మీనా దంపతుల కుమారుడు శ్యాంచరణ్ నిరుపేద కుటుంబానికి చెందినవాడని, బ్రతుకుతెరువు కోసం నాగరాజు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా, కుమారుడు కె.శ్యాంచరణ్ కు ఇటీవలే జరిగిన ఆటో ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. చిన్నారుడు ఈదులవలస మోడల్ పాటశాలలో 6 వ తరగతి చదువుతున్నారని, ఆటోలో పాఠశాలకు వెళుతుండగా జరిగిన ప్రమాదంలో కాళ్లు చేతులు, కాలర్ బోన్ విరిగి పోవడంతో, తలకు తీవ్రమైన గాయాలయ్యాయన్నారు. మెరుగైన వైద్యం కోసం, శ్రీకాకుళం కిమ్స్ కు తరలించగా, పరిశీలించిన వైద్యులు, విరిగిన కాళ్ళు, చేతులకు శస్త్ర చికిత్స అవసరమని, బ్రెయిన్ కు రంద్రం ఏర్పడిందని తెలపగా, పేద కుటుంబం కావటంతో, స్పందించిన, ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ మార్పు.విజయకుమార్ స్నేహితులు, దాతలు సహకారంతో లక్షా ఏభై వేల రూపాయల ఆర్ధికసహాయాన్ని, బాధిత కుటుంబ సబ్యులకు అందించి అండగా నిలిచారు. మనసున్న దాతలు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కుటుంబానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు ఉర్లం.శివతేజ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *