Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

చిత్తూరు జిల్లాలో ఆపరేషన్ వికటించి పురిటిబిడ్డ మృతి …. .

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • CHITTOR:ఆపరేషన్ వికటించి పురిటి బిడ్డ మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు .
  • ఇందుకు బాధ్యులైన ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు .
  • ఈ ఘటన మదనపల్లెలోని ప్రైవేటు ఆసుపత్రిలో జరిగింది .

CHITTOR:ఆపరేషన్ వికటించి పురిటి బిడ్డ మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు . ఇందుకు బాధ్యులైన ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఈ ఘటన మదనపల్లెలోని ప్రైవేటు ఆసుపత్రిలో జరిగింది . చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ప్రైవేటు ఆసుపత్రిలో పురిటిబిడ్డ చనిపోయింది . పుంగనూరు వాండ్లపల్లికి చెందిన ముబారక్ బేగం ( 23 ) పురిటి నొప్పులతో పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం చేరింది . సాయంత్రం పురిటి నొప్పులు ఎక్కువ కావడం వల్ల మహిళా డాక్టర్ ఆపరేషన్ చేసుకోవాలని సూచించింది . అయితే అంత సమయం లేకపోవడం వల్ల సాధారణ కాన్పు చేస్తున్నట్లు ఆసుపత్రి సిబ్బంది బాధితురాలి తల్లిదండ్రులకు తెలిపారు . అనంతరం కొద్దిసేపటికే మగ బిడ్డకు బేగం జన్మనిచ్చింది . అయితే ఆ బిడ్డ అప్పటికే చనిపోయి ఉండటం , పురిటి బిడ్డకు గాయాలు ఉండటాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు గమనించారు . ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా పురిటి బిడ్డ చనిపోయిందని బంధువులు ఆరోపించారు . ఆసుపత్రి సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలి బంధువులు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *