వార్త ముఖ్యాంశాలు
- ఐరాల: చిత్తూరు జిల్లా డిఫెన్స్ వెటరన్స్ ఆర్గనైజేషన్ (DVO) నూతన జిల్లా అధ్యక్షుడిగా కాణిపాకానికి చెందిన శ్రీకృష్ణం దుర్గాప్రసాద్ నియమితులయ్యారు.
- కాణిపాకంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సైనికుల సమావేశంలో డిఫెన్స్ వెటరన్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని దుర్గాప్రసాద్‌కు నియామక ఉత్తర్వులను అందజేశారు.
- అదే కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా పాపుడేసి దొరబాబును నియమించారు.
ఐరాల: చిత్తూరు జిల్లా డిఫెన్స్ వెటరన్స్ ఆర్గనైజేషన్ (DVO) నూతన జిల్లా అధ్యక్షుడిగా కాణిపాకానికి చెందిన శ్రీకృష్ణం దుర్గాప్రసాద్ నియమితులయ్యారు. కాణిపాకంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సైనికుల సమావేశంలో డిఫెన్స్ వెటరన్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని దుర్గాప్రసాద్‌కు నియామక ఉత్తర్వులను అందజేశారు. అదే కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా పాపుడేసి దొరబాబును నియమించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం నిస్వార్థంగా సేవలందించిన మాజీ సైనికుల సంక్షేమానికి డిఫెన్స్ వెటరన్స్ ఆర్గనైజేషన్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, సైనిక కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సంస్థ పనిచేస్తుందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దుర్గాప్రసాద్ మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతనంగా నియమితులైన దుర్గాప్రసాద్, దొరబాబులను పలువురు సైనికులు, మాజీ సైనికులు అభినందించారు. కార్యక్రమంలో సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు