Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

చిట్వేల్ మండలంలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చిట్వేల్ మండలంలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా

అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల నిరంతర పర్యవేక్షణ
చిట్వేల్: మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా చేపట్టారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, కోడూరు రూరల్ సీఐ శ్రీ డి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.చిట్వేల్ మండలంలోని మల్లెంపల్లి, జెట్టివారిపల్లి, తుమ్మకొండ గ్రామాలతో పాటు ఆయా గ్రామాల శివారు ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలపై డ్రోన్ కెమెరాల ద్వారా విస్తృత నిఘా ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా పేకాట స్థావరాలు, కోళ్ల పందేలు నిర్వహించే ప్రాంతాలు, గంజాయి నిల్వ లేదా వినియోగానికి సంబంధించిన అనుమానాస్పద ప్రదేశాలు, బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీసులు తెలిపారు.డ్రోన్ నిఘా ద్వారా గుర్తించే అనుమానాస్పద కదలికలు, ప్రదేశాలపై స్థానిక పోలీసు సిబ్బంది వెంటనే స్పందించి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి మండలంలోని మరిన్ని గ్రామాలకు కూడా డ్రోన్ నిఘాను విస్తరించి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు చేపడతామని తెలిపారు.తమ గ్రామాల్లో పేకాట, కోళ్ల పందేలు, గంజాయి వినియోగం లేదా బహిరంగంగా మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

చిట్వేల్ మండలంలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా

చిట్వేల్ మండలంలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా

చిట్వేల్ మండలంలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *