వార్త ముఖ్యాంశాలు
- చిట్వేల్ మండల తహసీల్దార్ నరసింహారావుపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి.
- మురళి కోరారు.
- శనివారం తిరుపతిలోని గంధమనేని శివయ్య భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మండల పరిధిలో ప్రభుత్వ బంజరు భూముల ఆక్రమణలపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు.
చిట్వేల్ మండల తహసీల్దార్ నరసింహారావుపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి. మురళి కోరారు. శనివారం తిరుపతిలోని గంధమనేని శివయ్య భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మండల పరిధిలో ప్రభుత్వ బంజరు భూముల ఆక్రమణలపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. మైలపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 490/2లో ఉన్న 1.50 ఎకరాల భూమి వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వ భూములను గుర్తించి, ఆక్రమణలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భూములను రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని మురళి తెలిపారు.