Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

చిట్వేల్‌లో 45 మంది అకాడమిక్ ఇన్స్పెక్టర్ల విధుల్లో చేరిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
చిట్వేల్‌లో 45 మంది అకాడమిక్ ఇన్స్పెక్టర్ల విధుల్లో చేరిక

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్ మండలంలోని ప్రాథమిక పాఠశాలల్లో 41 మంది అకాడమిక్ ఇన్స్పెక్టర్లు, జడ్పీహెచ్‌ఎస్ చిట్వేల్‌లో నలుగురు స్కూల్ అసిస్టెంట్ అకాడమిక్ ఇన్స్పెక్టర్లు విధుల్లో చేరారు.
  • కేటాయించిన పాఠశాలల్లో సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎంఈఓలు ఖాజా మొహిద్దిన్, ఈశ్వరయ్య సూచించారు.
  • విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి కృషి చేయాలని, పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

చిట్వేల్ మండలంలోని ప్రాథమిక పాఠశాలల్లో 41 మంది అకాడమిక్ ఇన్స్పెక్టర్లు, జడ్పీహెచ్‌ఎస్ చిట్వేల్‌లో నలుగురు స్కూల్ అసిస్టెంట్ అకాడమిక్ ఇన్స్పెక్టర్లు విధుల్లో చేరారు. కేటాయించిన పాఠశాలల్లో సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎంఈఓలు ఖాజా మొహిద్దిన్, ఈశ్వరయ్య సూచించారు. విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి కృషి చేయాలని, పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. వీరి నియామకంతో మండలంలో ఉపాధ్యాయుల కొరత చాలావరకు తీరిందని తెలిపారు. సీనియర్ ఉపాధ్యాయులు కామాటం వెంకటేశ్వర్లు, బాలసుబ్రమణ్యం కొత్తగా చేరిన వారికి సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది, క్లస్టర్ రిసోర్స్ ఉపాధ్యాయులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, అకాడమిక్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *