Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఘనంగా నాగుల పంచమి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా నాగుల పంచమి వేడుకలు

పున్నమి ప్రతినిధి
నిర్మల్ జిల్లా ముధోల్ :మండలకేంద్రమైన ముధోల్తో పాటు వివిధ గ్రామాల్లో సోమవారం నాగుల పంచమి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు కొత్త వస్త్రాలు ధరించి గ్రామ సమీపంలో గల పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తమ సోదరుల కళ్ళను పాలతో కడిగి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు. గ్రామాల్లోని ఆలయాల్లో నాగుల పంచమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. పురాతన ఆలయమైన శ్రీ జఠశంకర ఆలయం, శ్రీ పశుపతినాథ్ శివాలయంలో పూజలు నిర్వహించేందుకు భక్తులు తరలివచ్చారు.

ఘనంగా నాగుల పంచమి వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *