Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గ్రామస్తుల అర్జీ పై స్పందించిన బోగోలు మండల ఎమ్మార్వో గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి.

బోగోలుమండలం చెంచులక్ష్మిపురంకు శ్మశాన స్థలం కావాలని గ్రామస్తులు సమర్పించిన అర్జీపై ఎమ్మార్వో గారు స్పందించారు. సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. అర్జీపై స్పందించిన ఎమ్మార్వో గారు, స్థల పరిశీలన కోసం మండల సర్వేయర్ అశోక్ గారు, గ్రామ వీఆర్వో సింగరయ్య గారిని గ్రామానికి పంపించారు.

అధికారులు గ్రామంలో స్థలాన్ని పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. గ్రామస్తుల సమస్యపై స్పందించి స్థల పరిశీలనకు అధికారులు పంపించిన ఎమ్మార్వో గారికి మరియు వచ్చిన సర్వేయర్ అశోక్ గారికి, వీఆర్వో సింగరయ్య గారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మార్వో కార్యాలయానికి వివిధ సమస్యలపై వచ్చే అర్జీదారులను అటెండర్లు అయిన రమణయ్య, సుధాకర్ లు వారి సమస్యలను తెలుసుకుని అనంతరం సమస్యకు సంబంధించిన అధికారులను సూచిస్తూ, అర్జీదారులను సంబంధిత అధికారి వద్దకు పంపిస్తున్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటెండర్లు సహకరిస్తుండటంపై అర్జీదారులు అభినందిస్తున్నారు .

గ్రామస్తుల అర్జీ పై స్పందించిన బోగోలు మండల ఎమ్మార్వో గారు

గ్రామస్తుల అర్జీ పై స్పందించిన బోగోలు మండల ఎమ్మార్వో గారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *