Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఓటును త్వరగా నమోదు చేసుకోవాలి :డాక్టర్ మాచర్ల బిక్షపతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఓటును త్వరగా నమోదు చేసుకోవాలి :డాక్టర్ మాచర్ల బిక్షపతి

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటును త్వరగా నమోదు చేసుకోవాలి:డాక్టర్ మాచర్ల బిక్షపతి
———————————————————————-
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువు సమీపిస్తున్న తరుణంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం లో జిల్లా నాయకులతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ టీఆర్పీ ఎమ్మెల్యే అభ్యర్థి మాచర్ల బిక్షపతి హాజరయ్యారు..
ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ అని అన్నారు. గడువు ముగియడానికి కొద్ది రోజులే సమయం ఉన్నందున, పట్టభద్రులు ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే తమ ఓటును నమోదు చేసుకోవాలన్నారు. గతంలో ఓటు వేసిన వారు కూడా ప్రస్తుత ఎన్నికల కోసం నూతనంగా (De-novo) దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
కట్ల సదానందం మాట్లాడుతూ.. తెలంగాణ సమాజంలో విద్యావంతుల పాత్ర కీలకమైనదని, విద్యావంతుల గొంతుకను బలంగా వినిపించడానికే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని యువత, ఉద్యోగులు, ప్రైవేట్ రంగ నిపుణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫామ్-18 నింపి ఓటరుగా నమోదు కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గడ్డం కృష్ణ, రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షులు అఫ్సర్, రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి మహమ్మద్ అంజద్ పాషా, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పిట్టల సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు రేణుకుంట్ల మురళి బైండ్ల,జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదరి సతీష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్స్ జిటబోన నరేష్, సీసా శ్రీధర్ గౌడ్,జిల్లా యూత్ అధ్యక్షులు యమంకి విజయ్,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చెన్నూరు వంశీ, యావన్కి సల్మాన్ దినేష్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఓటును త్వరగా నమోదు చేసుకోవాలి :డాక్టర్ మాచర్ల బిక్షపతి

గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఓటును త్వరగా నమోదు చేసుకోవాలి :డాక్టర్ మాచర్ల బిక్షపతి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *