Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

గూడూరులో కోతుల బెడద.. భయాందోళనలో గ్రామస్తులు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గూడూరులో కోతుల బెడద.. భయాందోళనలో గ్రామస్తులు!

వార్త ముఖ్యాంశాలు

  • రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • గూడూరు స్టేజీ నుంచి గ్రామానికి వెళ్లే మార్గంలో రహదారి వెంబడి కోతులు గుంపులుగా సంచరిస్తూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి.
  • రోడ్డుకు అడ్డంగా వస్తూ వాహనదారులను, పాదచారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గూడూరు స్టేజీ నుంచి గ్రామానికి వెళ్లే మార్గంలో రహదారి వెంబడి కోతులు గుంపులుగా సంచరిస్తూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. రోడ్డుకు అడ్డంగా వస్తూ వాహనదారులను, పాదచారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా వెళ్లేవారు, మహిళలు, చిన్నారులు కోతుల కారణంగా ఆందోళన చెందుతున్నారు. కోతులు అకస్మాత్తుగా మీదకు వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కోతుల బెడదను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *