Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

గుండె జబ్బుతో బాధపడుతున్న మహిళకు “మానవత” ఆర్థిక సాయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గుండె జబ్బుతో బాధపడుతున్న మహిళకు “మానవత” ఆర్థిక సాయం

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి, తాళ్లపూడి, మార్చి 17: మానవత - తాళ్లపూడి ఆధ్వర్యంలో గుండె జబ్బుతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న ప్రక్కిలంక గ్రామానికి చెందిన జుట్టా పద్మావతికి ఆర్థిక సహాయం అందజేశారు.
  • ఈ సందర్భంగా సంస్థ ద్వారా రూ.6,000, అంకెం సురేష్ రూ.1,000, కాలినేని ప్రదీప్ రూ.1,000 కలిపి మొత్తం రూ.8,000 ఆర్థిక సాయం అందించినట్లు సంస్థ అధ్యక్షుడు వెలుగుబంటి శ్రీనివాస్ తెలిపారు.
  • కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడవడమే “మానవత” సంస్థ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.

పున్నమి ప్రతినిధి, తాళ్లపూడి, మార్చి 17:
మానవత – తాళ్లపూడి ఆధ్వర్యంలో గుండె జబ్బుతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న ప్రక్కిలంక గ్రామానికి చెందిన జుట్టా పద్మావతికి ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా సంస్థ ద్వారా రూ.6,000, అంకెం సురేష్ రూ.1,000, కాలినేని ప్రదీప్ రూ.1,000 కలిపి మొత్తం రూ.8,000 ఆర్థిక సాయం అందించినట్లు సంస్థ అధ్యక్షుడు వెలుగుబంటి శ్రీనివాస్ తెలిపారు.
కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడవడమే “మానవత” సంస్థ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. అలాగే సంస్థ ప్రధానంగా విద్య, వైద్య సేవల కోసం అధికంగా ఖర్చు చేస్తుందని వెల్లడించారు.
వీరవల్లి శివకృష్ణ మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారు మానవతను ఆశ్రయిస్తే తప్పకుండా సహాయం అందిస్తామని తెలిపారు. సంస్థ ఫౌండర్ రామచంద్రారెడ్డి ఆశయాల మేరకు మానవ సేవ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వెలుగుబంటి శ్రీనివాస్, సనపల రాజశేఖర్, అప్పన వీరహనుమంతురావు, అంకెం సురేష్, పెమ్మాడి దుర్గాప్రసాద్, తైలం పోచారావు, కొప్పాక వెంకటేశ్వరరావు, వీరవల్లి శివకృష్ణ, సొలస గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *