ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 24 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం పిడూరుపాళెంలో సర్వేపల్లి ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి ఉత్తరక్రియలు నిర్వహించారు. కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఏపీ కనీస వేతన సలహా మండలి చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి హాజరై రామకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రామకృష్ణారెడ్డితో తనకు దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన అంకితభావంతో పనిచేసిన తీరును గుర్తుచేసుకున్నారు. పార్టీ కోసం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన మరణం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు.

గాలి రామకృష్ణారెడ్డికి ఘననివాళి
ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 24 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం పిడూరుపాళెంలో సర్వేపల్లి ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి ఉత్తరక్రియలు నిర్వహించారు. కార్యక్రమానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఏపీ కనీస వేతన సలహా మండలి చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి హాజరై రామకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రామకృష్ణారెడ్డితో తనకు దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన అంకితభావంతో పనిచేసిన తీరును గుర్తుచేసుకున్నారు. పార్టీ కోసం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన మరణం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొన్నారు.

