వార్త ముఖ్యాంశాలు
- పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోషకాహార స్థాయిని మెరుగుపరచడం భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రవేశపెట్టిన పోషణ అభియాన్ పథక లక్ష్యం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ 25 సంవత్సరాల ప్రజాసేవకు గుర్తుగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప…
- నరేంద్ర మోదీ ఆదేశాలమేరకు కొవ్వూరు పట్టణంలో కూడా అంగన్వాడి కేంద్రాలలో సేవలందిస్తున్న టీచర్స్ ఆయాలకు బిజెపి ఆధ్వర్యంలో సత్కారం చేయడం జరిగింది.
- ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ..
పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పోషకాహార స్థాయిని మెరుగుపరచడం భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రవేశపెట్టిన పోషణ అభియాన్ పథక లక్ష్యం
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ 25 సంవత్సరాల ప్రజాసేవకు గుర్తుగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రం ద్వారా నిరంతరం ఉన్నతమైన సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్స్ ను ఆయాలను సత్కరించాలని. నరేంద్ర మోదీ ఆదేశాలమేరకు కొవ్వూరు పట్టణంలో కూడా అంగన్వాడి కేంద్రాలలో సేవలందిస్తున్న టీచర్స్ ఆయాలకు బిజెపి ఆధ్వర్యంలో సత్కారం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ.. కటిక పేదరికం నుంచి వచ్చిన నరేంద్ర మోదీ పేదల కష్టాలు తెలిసి పేదల ప్రయోజనాల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు.
అందులో పోషణ అభియాన్ కార్యక్రమం అత్యంత ప్రధానమైనది. దేశంలోని తల్లులు, చిన్నారులకు పోషక ఆహార లోపం ఉండకూడదని.. ఆరోగ్యకరమైన తల్లులు పిల్లలు ఉంటేనే ఆరోగ్యకరమైన భారత్ ను నిర్మించవచ్చు అని పోషణ అభియాన్ పథకాన్ని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారు. పోషక ఆహార పదార్థాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లులకు పిల్లలకు అందిస్తున్నారు. పిల్లల వయస్సు 6 సంవత్సరాలు వచ్చేఅంతవరకు అనగా నర్సరీ, ఎల్.కె.జి, యూ.కె.జి చదువును అంగన్వాడీ కేంద్రాలలో అందుతుంది, ప్రజలు ఉపయోగించుకోవాలి. అంగన్వాడి సిబ్బంది సేవలకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని పిక్కి నాగేంద్ర అన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఉదయ భాను కళావతి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిల్లలమర్రి మురళీకృష్ణ, కొవ్వూరు పట్టణ అధ్యక్షులు చెరుకూరి సాయి రామకృష్ణంరాజు, తాడిమళ్ళ విజయవాణి, జిల్లా ఉపాధ్యక్షులు బోడపాటి ముత్యాలరావు, మహిళా మోర్చా అధ్యక్షులు దార్లంక పద్మావతి, నాయకులు తురగా విజయభాస్కర్, నేమాని వెంకట బాలరాణి.. తదితరులు పాల్గొన్నారు.