Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ముస్లిం ఏక్తా సంఘం మజ్జిగ పంపిణీ – సేవా కార్యక్రమాన్ని అభినందించిన ఎస్పీ జానకి షర్మిల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ముస్లిం ఏక్తా సంఘం మజ్జిగ పంపిణీ – సేవా కార్యక్రమాన్ని అభినందించిన ఎస్పీ జానకి షర్మిల

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి) నిర్మల్: నిర్మల్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
  • కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రారంభించి, కులమతాలకు అతీతంగా సేవ చేయడం హిందూ–ముస్లిం ఐక్యతకు ప్రతీక అని అభినందించారు.
  • ఈ సందర్భంగా సంఘం ఉపాధ్యక్షులు సాజిద్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉందని, నిర్మల్‌లో సోదరభావం, మతసామరస్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 26 ( పున్నమి ప్రతినిధి)
నిర్మల్: నిర్మల్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా తెలంగాణ ముస్లిం ఏక్తా సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రారంభించి, కులమతాలకు అతీతంగా సేవ చేయడం హిందూ–ముస్లిం ఐక్యతకు ప్రతీక అని అభినందించారు.
ఈ సందర్భంగా సంఘం ఉపాధ్యక్షులు సాజిద్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉందని, నిర్మల్‌లో సోదరభావం, మతసామరస్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు షేక్ ముజాహిద్, గౌరవ అధ్యక్షులు హబీబ్ జిలాని, ప్రధాన కార్యదర్శి అల్మాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *