Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో 8వ రోజు ఘనంగా పూజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో 8వ రోజు ఘనంగా పూజలు

రంగారెడ్డి జిల్లా: మాధవ్ నగర్ కాలనీ: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొనుగోటి రామ్మోహన్‌రావు–రాధిక దంపతులు, బి. సాయి రెడ్డి–మధులస దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ పూజా కార్యక్రమంలో మాధవ్ నగర్ కాలనీ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్, ముత్యాలు గారితో పాటు మహిళా సోదరీమణులు జ్యోతి రెడ్డి, నిర్మల రెడ్డి, అనిత రెడ్డి, రాధిక రావు, శోభ, సుశీల, చల్ల స్వప్న, అమల ముదిరాజ్ తదితరులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాల సందర్భంగా కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో 8వ రోజు ఘనంగా పూజలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *