గణేష్ ఉత్సవాల్లో ఘనంగా అన్నదాన కార్యక్రమం
పాల్గొన్న కాంగ్రెస్ కడప నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్
పున్నమి ప్రతినిధి
సెప్టెంబర్ 19
కడప: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కడప నగరంలోని మాసాపేట 6వ వీధిలో రాములవారి ఆలయం వద్ద ఏ.ఆర్.వి. యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కడప నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్ పీర్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గౌస్ పీర్ మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
స్థానిక ప్రజలకు ఎప్పుడు, ఎలాంటి ఇబ్బంది వచ్చినా తన వంతు సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని గౌస్ పీర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా కార్యక్రమాలకు పార్టీ తరఫున సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
రాబోయే కడప కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం లభించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం రావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఏ.ఆర్.వి. యూత్ కమిటీ సభ్యులు సాయి, మురళీకృష్ణ తదితరులు గౌస్ పీర్‌ను ఘనంగా సత్కరించి ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర ఉపాధ్యక్షులు అంజన్ కుమార్, ఫజరుల్లా, సౌధాకర్, సాదిక్, డివిజన్ ఇన్‌చార్జులు మహబూబ్ బాషా, ముబారక్, సయ్యద్ అన్వర్, షేక్ అన్వార్, సిద్ధిక్, మురాద్, ఆరిఫ్, హేమచంద్ర, ఏ.ఆర్.వి. యూత్ సభ్యులు ఎన్.డి. విజయ్, చైతన్య తదితర కాంగ్రెస్ నాయకులు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





