Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గండిపాలెంలో భారీ కొండచిలువ కలకలం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గండిపాలెంలో భారీ కొండచిలువ కలకలం

వార్త ముఖ్యాంశాలు

  • గండిపాలెం గ్రామంలోని బీసీ కాలనీలో భారీ కొండచిలువ కలకలం రేపింది.
  • పాశం రత్తయ్య ఇంట్లోకి సుమారు 20 అడుగుల పొడవున్న కొండచిలువ చొరబడింది.
  • గురువారం తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో దీనిని గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.

గండిపాలెం గ్రామంలోని బీసీ కాలనీలో భారీ కొండచిలువ కలకలం రేపింది. పాశం రత్తయ్య ఇంట్లోకి సుమారు 20 అడుగుల పొడవున్న కొండచిలువ చొరబడింది. గురువారం తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో దీనిని గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని సురక్షితంగా తరలించారు. ఈ రెస్క్యూ కార్యక్రమంలో స్థానికుడు వెంగపల్లి కుమార్ రాజా అటవీ సిబ్బందికి సహకరించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *