గాజువాక, నవంబర్ 2 (పున్నమి ప్రతినిధి):
గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని మింది గ్రామంలో కిడ్నాప్‌కు గురైన 13 ఏళ్ల బాలికను విశాఖపట్నం సిటీ పోలీసులు గంట వ్యవధిలోనే సురక్షితంగా రక్షించారు. సోమవారం తెల్లవారుజామున 3.10 గంటలకు సమాచారం అందుకున్న సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి.డి. బాబు, గాజువాక ఎస్ఐ జగదీష్ సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. టెక్ సెల్ సహకారంతో బీసీ రోడ్డు సమీపంలో బాలికను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోలీసుల వేగవంతమైన స్పందన, సమన్వయ చర్యలపై మింది గ్రామస్థులు అభినందనలు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు లేదా గాజువాక పోలీసులను 9490617922 నంబరులో సంప్రదించాలని ఇన్స్పెక్టర్ జి.డి. బాబు సూచించారు.


