Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

జీవీఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు.. 51.47 శాతం పోలింగ్ నమోదు గాజువాక జోన్‌లో 54.10 శాతం.. అగనంపూడిలో 53.46

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జీవీఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు.. 51.47 శాతం పోలింగ్ నమోదు గాజువాక జోన్‌లో 54.10 శాతం.. అగనంపూడిలో 53.46

మొత్తం 18,37,901 మంది ఓటర్లకు గాను 9,45,915 మంది ఓటు హక్కు వినియోగం

గాజువాక, నవంబర్ 2 (పున్నమి ప్రతినిధి):

విశాఖపట్నం మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల అధికారులు విడుదల చేసిన వార్డుల వారీ పోలింగ్ శాతం నివేదిక ప్రకారం జీవీఎంసీ పరిధిలో మొత్తం 51.47 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 18,37,901 మంది ఓటర్లకు గాను 9,45,915 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్‌లో పురుష ఓటర్లు 4,55,395 మంది, మహిళా ఓటర్లు 4,90,519 మంది ఓటు వేశారు. మహిళా ఓటర్ల భాగస్వామ్యం పురుషుల కంటే ఎక్కువగా నమోదైంది.

గాజువాక జోన్‌లో 54.10 శాతం

గాజువాక జోన్ పరిధిలో మొత్తం 2,98,229 మంది ఓటర్లు ఉండగా, 1,61,339 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 54.10 శాతం పోలింగ్ నమోదైంది. అగనంపూడి జోన్‌లో 69,796 మంది ఓటర్లకు గాను 37,314 మంది ఓటు వేయడంతో 53.46 శాతం పోలింగ్ నమోదైంది.

ఇక ఇతర జోన్లలో అనకాపల్లిలో 65.54 శాతం, భీమిలిలో 64.95 శాతం, వెస్ట్ జోన్‌లో 51.21 శాతం, మధురవాడలో 50.81 శాతం, ఈస్ట్ జోన్‌లో 50.55 శాతం, సౌత్ జోన్‌లో 51.24 శాతం, పెందుర్తిలో 48.93 శాతం, నార్త్ జోన్‌లో 44.24 శాతం పోలింగ్ నమోదైంది.

మొత్తంగా జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఓటర్ల తీర్పుపై ఆధారపడి ఉంది. వార్డుల వారీగా నమోదైన పోలింగ్ శాతాలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు, వారి అనుచరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జీవీఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు.. 51.47 శాతం పోలింగ్ నమోదు గాజువాక జోన్‌లో 54.10 శాతం.. అగనంపూడిలో 53.46

Leave a comment

Your email address will not be published. Required fields are marked *