Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఖానాపూర్ మండలంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఖానాపూర్ మండలంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.

ఖానాపూర్ ఆగస్టు 15(పున్నమి ప్రతినిధి ) ఖానాపూర్ మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ సుజాత జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాధా రాథోడ్ పతాకవిష్కరణ గావించారు. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో, మోడల్ పాఠశాలలో, కేజీబీవీ పాఠశాలల్లో, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్లో, కాంగ్రెస్, బి ఆర్ ఎస్, బి జె పి, అంబేద్కర్ యువజన సంఘాలలో, వివిధ కుల సంఘాలలో, వివిధ యువజన సంఘాలలో, ప్రెస్ క్లబ్ లో, అధికారులు మరియు సంఘాల అధ్యక్ష కార్యదర్శులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉదయం నుండే పాఠశాల విద్యార్థులు పట్టణము గ్రామాలలో ప్రభాతభేరి నిర్వహించారు, జాతీయ నాయకుల భారతమాత వేషధారులతో, దేశభక్తి గీతాలతో నాట్యాలతో దేశభక్తిని పర్వశించే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఎటు చూసినా దేశభక్తిని పరవశించే గీతాలు వేషధారణలు ఆసక్తిగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఆయా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సహా ఉపాధ్యాయులు యువకులు, ప్రజలు పాల్గొని తమ దేశభక్తిని చాటారు.

ఖానాపూర్ మండలంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *