Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఖానాపూర్ అభివృద్ధికి మరో ముందడుగు.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఖానాపూర్ అభివృద్ధికి మరో ముందడుగు.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అక్టోబర్ 6 పున్నమి ప్రతినిధి నిర్మల్ జిల్లా
ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో పలు అభివృద్ధి పనులకు నేడు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు శంకుస్థాపన చేశారు.
ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా కడెం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ భవనానికి రూ.2.25 కోట్లు, ఖానాపూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ భవనానికి రూ.2.25 కోట్లు, ఖానాపూర్‌లో సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ భవనానికి రూ.1.40 కోట్లు మంజూరు కాగా, దస్తురాబాద్ మండలం గోడ్సెరియాల్‌లో పీహెచ్‌సీ సబ్‌ సెంటర్‌తో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
నియోజకవర్గ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, మంజూరైన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు పేర్కొన్నారు.

ఖానాపూర్ అభివృద్ధికి మరో ముందడుగు.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *