Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఖమ్మం టూ టౌన్ వీధి వ్యాపారులకు అండగా బీజేపీ నేతలు:

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఖమ్మం టూ టౌన్ వీధి వ్యాపారులకు అండగా బీజేపీ నేతలు:

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం డిసెంబర్ (పున్నమి జిల్లా ప్రతి నిధి) ఖమ్మం నగరంలోని టూ టౌన్ పరిధిలో గల పాత బస్టాండ్ ఎదురుగా, 44వ డివిజన్‌లోని వీధి వ్యాపారుల ప్రాంగణానికి సంబంధించిన కూరగాయల పర్చేస్ షాపుల కేటాయింపుల కోసం ఖమ్మం కార్పొరేషన్ అధికారులు డ్రా విధానాన్ని నిర్వహించారు.
  • జనాభా రిజర్వేషన్ ప్రాతిపదికన, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్, మహిళలకు ప్రత్యేక కేటాయింపులతో ఈ డ్రాను భక్త రామదాసు కళాక్షేత్రం వద్ద నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు దాసరి మధు, టూ టౌన్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ జ్యోతుల యుగంధర్ నాయుడు వీధి వ్యాపారులకు అండగా నిలిచారు.

ఖమ్మం డిసెంబర్
(పున్నమి జిల్లా ప్రతి నిధి)

ఖమ్మం నగరంలోని టూ టౌన్ పరిధిలో గల పాత బస్టాండ్ ఎదురుగా, 44వ డివిజన్‌లోని వీధి వ్యాపారుల ప్రాంగణానికి సంబంధించిన కూరగాయల పర్చేస్ షాపుల కేటాయింపుల కోసం ఖమ్మం కార్పొరేషన్ అధికారులు డ్రా విధానాన్ని నిర్వహించారు. జనాభా రిజర్వేషన్ ప్రాతిపదికన, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్, మహిళలకు ప్రత్యేక కేటాయింపులతో ఈ డ్రాను భక్త రామదాసు కళాక్షేత్రం వద్ద నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు దాసరి మధు, టూ టౌన్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ జ్యోతుల యుగంధర్ నాయుడు వీధి వ్యాపారులకు అండగా నిలిచారు. డ్రా ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి, వ్యాపారుల హక్కులు పరిరక్షించాల్సిన అవసరాన్ని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం టూ టౌన్ బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *