అనపర్తి, సెప్టెంబరు 24 (పున్నమి ప్రతినిధి): క్యాన్సర్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అనపర్తి నియోజకవర్గంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు. బలభద్రపురంలో నిర్వహించిన శిబిరంలో 380 మందికి పరీక్షలు చేయగా 39 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. ఇటీవల నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌లో 51 మందికి పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. సంస్కార ఫౌండేషన్, పింక్ ఇండియా ఆధ్వర్యంలో త్వరలో మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సీఎస్‌ఆర్ నిధులతో నియోజకవర్గంలో సుమారు 5,000 మందికి వైద్యం అందించేందుకు ఫౌండేషన్లు ముందుకు వచ్చాయని వెల్లడించారు.

క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే పిలుపు