Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొత్తపేట ప్రీమియర్ లీగ్ సీజన్-8 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొత్తపేట ప్రీమియర్ లీగ్ సీజన్-8 కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు..!
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు 16-జనవరి-2026 దుత్తలూరు మండలం కొత్తపేట గ్రామంలో నిర్వహించిన కొత్తపేట ప్రీమియర్ లీగ్ – సీజన్ 8 క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు యువతతో కలిసి ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా యువతను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో సరదాగా క్రికెట్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు.
  • క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంలో, స్నేహభావాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే గారు తెలిపారు.

దుత్తలూరు
16-జనవరి-2026

దుత్తలూరు మండలం కొత్తపేట గ్రామంలో నిర్వహించిన కొత్తపేట ప్రీమియర్ లీగ్ – సీజన్ 8 క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు యువతతో కలిసి ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యువతను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో సరదాగా క్రికెట్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంలో, స్నేహభావాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే గారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

అలాగే, ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన యువత వ్యాపార, ఉద్యోగ నిమిత్తం బయట ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ, సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు తిరిగి వచ్చి గ్రామ సమస్యలను తెలుసుకుంటూ, వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్న తీరును ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ప్రశంసించారు. గ్రామ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని, వారి ఐక్యత మరియు సేవాభావం భవిష్యత్తులో గ్రామాలకు మరింత వెలుగును తీసుకువస్తుందని అభినందనలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *