Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

కైలాసపురం ధర్మశాస్త్ర దేవాలయంలో మండల దీక్ష ముగింపు – 40 రోజుల పాటు భవ్య అన్నదాన సేవ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కైలాసపురం ధర్మశాస్త్ర దేవాలయంలో మండల దీక్ష ముగింపు – 40 రోజుల పాటు భవ్య అన్నదాన సేవ

వార్త ముఖ్యాంశాలు

  • కైలాసపురం శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో గత నలభై రోజులుగా మండల దీక్షలో పాల్గొన్న భక్తులకు ప్రతిదినం అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత భవ్యంగా నిర్వహించారు.
  • విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఉన్నతాధికారుల సహకారం, ఆలయ కమిటీ సభ్యుల కృషి, దీక్షబూనిన పీఠం స్వాముల నిరంతర సేవలతో ఈ మహత్తర కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
  • నేటితో ఈ 40 రోజుల అన్నదాన సేవ ఘనంగా ముగిసింది.

కైలాసపురం శ్రీ ధర్మశాస్త్ర దేవాలయంలో గత నలభై రోజులుగా మండల దీక్షలో పాల్గొన్న భక్తులకు ప్రతిదినం అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత భవ్యంగా నిర్వహించారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఉన్నతాధికారుల సహకారం, ఆలయ కమిటీ సభ్యుల కృషి, దీక్షబూనిన పీఠం స్వాముల నిరంతర సేవలతో ఈ మహత్తర కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.

నేటితో ఈ 40 రోజుల అన్నదాన సేవ ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, పీఠం గురుస్వామి మాట్లాడుతూ—
విశాఖ పోర్ట్ యాజమాన్యం, అధికారుల సహకారం వల్ల నీరు, విద్యుత్తు, వెలుగులు వంటి అవసరమైన సౌకర్యాలు నిరంతరంగా అందుబాటులో ఉన్నాయని, వారి అబిరామ పర్యవేక్షణతో కార్యక్రమ ప్రతిష్ట మరింత పెరిగిందని తెలిపారు.

అలాగే ఆలయ కమిటీ సభ్యులు, పీఠం స్వాములు తమదైన శైలిలో సేవలందించి మండల దీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో ప్రత్యేక సేవలు అందించిన మరికొందరు భక్తులు అయ్యప్ప కృపకు పాత్రులయ్యారని కృతజ్ఞతలు తెలిపారు.

ఈ పవిత్ర సేవలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కార్యాచరణ వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు.

కైలాసపురంలో ఆధ్యాత్మికత, సేవాస్ఫూర్తి, భక్తి భావాల సమ్మిళితంతో సాగిన ఈ మండల దీక్ష—అన్నదాన కార్యక్రమం స్థానిక భక్తులకు చిరస్మరణీయంగా నిలిచింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *