Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కె.వి.ఆర్ అంజలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కె.వి.ఆర్ అంజలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామంలో కెవిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరాన్ని ఇంజరం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు.ట్రస్ట్…
  • కుమార్తె దివంగత అంజలి పుట్టినరోజు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాకరపర్తి వెంకట్రావు పూర్ణిమ దంపతులు వెల్లడించారు.తమ కుమార్తె భౌతికంగా లేకపోయినా సమాజంలో ఆమె జ్ఞాపకాలు ఉండిపోయేలా చేయాలన్నది తమ అభిమతం అని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ మేనేజర్ ప్రసాద్,…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామంలో కెవిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరాన్ని ఇంజరం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు.ట్రస్ట్ బాధ్యులు కాకరపర్తి వెంకట్రావు పూర్ణిమ దంపతుల పర్యవేక్షణలో శిబిరాన్ని నిర్వహించారు.కిరణ్ కంటి ఆసుపత్రి మేనేజర్ నాగేశ్వరరావు, వైద్యులు డాక్టర్ అనిల్ డాక్టర్ లేఖన మరియు బృంద సభ్యులు వైద్య సేవలు అందించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కుమార్తె దివంగత అంజలి పుట్టినరోజు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాకరపర్తి వెంకట్రావు పూర్ణిమ దంపతులు వెల్లడించారు.తమ కుమార్తె భౌతికంగా లేకపోయినా సమాజంలో ఆమె జ్ఞాపకాలు ఉండిపోయేలా చేయాలన్నది తమ అభిమతం అని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఆర్ మేనేజర్ ప్రసాద్, కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సిఎస్ఆర్ కృష్ణమూర్తి, పివీఎస్ శాస్త్రి,బాజీ శర్మ, రవికుమార్ శాస్త్రి ఆనంద్, సుభాష్,వెల్లంకి వెంకట శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *