వార్త ముఖ్యాంశాలు
- నవంబర్ 17న సామూహిక సెలవు పెట్టి ఉద్యమంలో పాల్గొనాలి: రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మహాదేవ్ కృష్ణా మండలం: తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఎన్.
- కృపాకర రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా మండల CPS ఉద్యోగుల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
- ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్.
నవంబర్ 17న సామూహిక సెలవు పెట్టి ఉద్యమంలో పాల్గొనాలి: రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మహాదేవ్
కృష్ణా మండలం: తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఎన్. కృపాకర రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా మండల CPS ఉద్యోగుల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్. మహాదేవ్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఎం. మునెప్ప మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని, CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS) సాధన కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నవంబర్ 17న సామూహిక సెలవు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
అధ్యక్షుడిగా నల్లే శివరాజ్, ప్రధాన కార్యదర్శిగా ఎల్. స్వామినాథ్, అసోసియేట్ ప్రెసిడెంట్గా అభిలాష్, కోశాధికారిగా తిరుపతయ్య ఎన్నికయ్యారు. మహిళా విభాగం కన్వీనర్లుగా ఎస్. మాధవి, గీత, ఉపాధ్యక్షులుగా అజయ్, ఆంజనేయులు, కార్యదర్శులుగా ఖాసీం, రవి, రవి ఎన్నికయ్యారు. సమన్వయ సభ్యులుగా రంగారావు, వెంకటయ్య, బాలువివేక్ నియమితులయ్యారు.
ఈ కార్యక్రమంలో TSCPSEU రాష్ట్ర సహా అధ్యక్షుడు ఎస్. మహాదేవ్, PRTU నాయకులు రాఘవేంద్ర, అనిల్ కుమార్తో పాటు మండల CPS ఉద్యోగులు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్