Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కూటమి పాలనలో అభివృద్ధి–సంక్షేమం వేగవంతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కూటమి పాలనలో అభివృద్ధి–సంక్షేమం వేగవంతం

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 1 (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెంలో "రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం" కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిన లబ్ధిని వివరించారు.
  • అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 1 (పున్నమి ప్రతినిధి)
వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెంలో “రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందిన లబ్ధిని వివరించారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీల నివాసాలపై ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను పరిశీలించి, తాగునీటి కోసం బోరు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్ హైస్కూల్‌ను సందర్శించి విద్యార్థుల అవసరాలు తెలుసుకుని, క్రీడా మైదానం అభివృద్ధితో పాటు మెరుగైన క్రీడా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *