Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నారాయణపేట

కున్సీ గ్రామంలో వినూత్నంగా వినాయక శోభాయాత్ర ఎద్దుల బండిపై విఘ్నేశ్వరుడి ఊరేగింపు – ఆకట్టుకున్న సంప్రదాయ వైభవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కున్సీ గ్రామంలో వినూత్నంగా వినాయక శోభాయాత్ర ఎద్దుల బండిపై విఘ్నేశ్వరుడి ఊరేగింపు – ఆకట్టుకున్న సంప్రదాయ వైభవం

వార్త ముఖ్యాంశాలు

  • కున్సీ గ్రామంలోని వినాయక నగర్ విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా వినూత్నంగా వినాయక శోభాయాత్ర నిర్వహించారు.
  • మన పల్లె సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎద్దుల బండిని ప్రత్యేకంగా అలంకరించి, అందులో విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గ్రామ పురవీధుల గుండా భక్తిశ్రద్ధలతో ఊరేగించారు.
  • భజనలు, కీర్తనల నడుమ సాగిన శోభాయాత్రలో చిన్నారులు, యువత, మహిళలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని “గణపతి బప్పా మోరియా” అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

కున్సీ గ్రామంలోని వినాయక నగర్ విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా వినూత్నంగా వినాయక శోభాయాత్ర నిర్వహించారు. మన పల్లె సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎద్దుల బండిని ప్రత్యేకంగా అలంకరించి, అందులో విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గ్రామ పురవీధుల గుండా భక్తిశ్రద్ధలతో ఊరేగించారు.
భజనలు, కీర్తనల నడుమ సాగిన శోభాయాత్రలో చిన్నారులు, యువత, మహిళలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని “గణపతి బప్పా మోరియా” అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఎద్దుల బండిపై విఘ్నేశ్వరుడి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆధునికత వైపు పరుగులు తీస్తున్న నేటి రోజుల్లో పూర్వీకుల పల్లె సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసేలా నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామస్థులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తి, సంప్రదాయం, ఐక్యతను చాటుతూ సాగిన ఈ వినూత్న శోభాయాత్ర కున్సీ గ్రామ వినాయక చవితి వేడుకలకు ప్రత్యేకతను తీసుకొచ్చింది.
విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో కున్సీ గ్రామం సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ఆకాంక్షించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *