Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలి రెడ్‌క్రాస్‌కు దక్కిన అరుదైన గౌరవం: గవర్నర్‌ బంగారు పతకాలకు ఇద్దరు ఎంపిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కావలి రెడ్‌క్రాస్‌కు దక్కిన అరుదైన గౌరవం: గవర్నర్‌ బంగారు పతకాలకు ఇద్దరు ఎంపిక

వార్త ముఖ్యాంశాలు

  • *తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం*👌👌 *ఆర్డీవో సన్నీ వంశీకృష్ణ, రమేష్‌రెడ్డి లకు ఆర్డీవో ఎలీషా బాబు అభినందనలు*💐💐 *కావలి: సమాజ సేవలో ముందుండే కావలి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి అరుదైన గౌరవం లభించింది.
  • ప్రతిష్ఠాత్మక గవర్నర్‌ బంగారు పతకాలకు కావలి రెడ్‌క్రాస్ బాధ్యులు ఎంపికయ్యారని కావలి ఆర్డీవో, రెడ్‌క్రాస్ అధ్యక్షులు డి.ఎలీషా బాబు వెల్లడించారు.
  • 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెడ్‌క్రాస్ ద్వారా విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను...

*తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానం*👌👌

*ఆర్డీవో సన్నీ వంశీకృష్ణ, రమేష్‌రెడ్డి లకు ఆర్డీవో ఎలీషా బాబు అభినందనలు*💐💐

*కావలి:
సమాజ సేవలో ముందుండే కావలి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక గవర్నర్‌ బంగారు పతకాలకు కావలి రెడ్‌క్రాస్ బాధ్యులు ఎంపికయ్యారని కావలి ఆర్డీవో, రెడ్‌క్రాస్ అధ్యక్షులు డి.ఎలీషా బాబు వెల్లడించారు.
2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెడ్‌క్రాస్ ద్వారా విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను… అప్పటి కావలి ఆర్డీవో, *రెడ్‌క్రాస్ మాజీ అధ్యక్షులు ఎం. సన్నీ* *వంశీకృష్ణ* తో పాటు కావలి రెడ్‌క్రాస్ పాలకమండలి సభ్యులు, *రోటేరియన్ “అంకినపల్లి రమేష్‌రెడ్డి”* ఈ అవార్డులకుఎంపికయ్యారు.విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సెప్టెంబర్ 1వ తేదీన జరగనున్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ సర్వసభ్య సమావేశంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర *గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్* చేతుల మీదుగా వీరు ఈ బంగారు పతకాలనుఅందుకోనున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను *ఆర్డీవో ఎలీషా బాబు* మనస్ఫూర్తిగాఅభినందించారు. వీరి సేవా నిరతిని స్ఫూర్తిగా తీసుకుని, మిగతా సభ్యులు కూడా సమాజ హితం కోసం మరిన్ని సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *