వార్త ముఖ్యాంశాలు
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా:( పున్నమి న్యూస్ )జులై 8 : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పుట్ట మధుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
- కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయ పవిత్రతకు మచ్చ తెచ్చేలా పుట్ట మధు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఈజీసీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ తదితరులతో కలిసి మాట్లాడిన కర్ణాకర్, కాలేశ్వరం…
- శ్రీధర్ బాబు తన సొంత ఖర్చులతో చీరలు కొనుగోలు చేసి, భక్తులకు ఒక లడ్డు, గంగాజలం బాటిల్ అందజేశారని తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:( పున్నమి న్యూస్ )జులై 8 : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పుట్ట మధుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయ పవిత్రతకు మచ్చ తెచ్చేలా పుట్ట మధు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఈజీసీ స్టేట్ కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ తదితరులతో కలిసి మాట్లాడిన కర్ణాకర్, కాలేశ్వరం నిధుల దుర్వినియోగంపై పుట్ట మధు చేస్తున్న వ్యాఖ్యలు అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు.
శ్రీధర్ బాబు తన సొంత ఖర్చులతో చీరలు కొనుగోలు చేసి, భక్తులకు ఒక లడ్డు, గంగాజలం బాటిల్ అందజేశారని తెలిపారు. భక్తులకు పంపిణీ చేసిన క్యారీ బ్యాగులపై ప్రభుత్వ హోలోగ్రామ్, ముఖ్యమంత్రి లేదా దేవాదాయ శాఖ మంత్రి ఫోటోలు లేవని, కేవలం శ్రీధర్ బాబు, ఆయన తండ్రి శ్రీపాదరావు ఫోటోలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఆలయ నిధులు లేదా ఆలయ వస్తువుల దుర్వినియోగం జరిగిందని చెప్పడం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.శ్రీధర్ బాబుపై నిరాధార ఆరోపణలు చేస్తూ విషం చిమ్ముతున్న పుట్ట మధు తన వైఖరిని మార్చుకోవాలని బట్టు కర్ణాకర్ హితవు పలికారు. వరుస ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతున్నా పుట్ట మధులో మార్పు రాకపోవడం విచారకరమని, అసత్య ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తే రానున్న ఎన్నికల్లో ప్రజలు మరోసారి తగిన సమాధానం చెబుతారని అన్నారు.ఈ సమావేశంలో డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, టౌన్ అధ్యక్షుడు దేవన్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, డీసీసీ ఉపాధ్యక్షుడు సుందర్‌తో పాటు మహిళా, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.