Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కామారెడ్డి

కామారెడ్డి పట్టణంలో బంగారం కొనుగోళ్లకు ‘నో స్టాక్.. నో బుకింగ్!’

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కామారెడ్డి పట్టణంలో బంగారం కొనుగోళ్లకు ‘నో స్టాక్.. నో బుకింగ్!’
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • కామారెడ్డి, 29 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి!
  • జిల్లా పట్ట ణంలోని బంగారు షాపుల వద్దకు కస్టమర్లు ఆశల తో వెళ్తున్నారు, కానీ 'నో స్టాక్..
  • నో బుకింగ్!' అనే నినాదంతో తిరిగి వస్తున్నారు.

కామారెడ్డి, 29 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :

బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి! జిల్లా పట్ట ణంలోని బంగారు షాపుల వద్దకు కస్టమర్లు ఆశల తో వెళ్తున్నారు, కానీ ‘నో స్టాక్.. నో బుకింగ్!’ అనే నినాదంతో తిరిగి వస్తున్నారు. ఒక్క రోజులో బంగారం రేట్లు గ్రాము 1000 వరకు పెరగడంతో షాపు యజమానులు స్టాక్‌లను దాచేసి, కొత్త బుకింగ్‌లకు దూరంగా పోయారు.పట్టణంలోని ప్రముఖ బంగారు దుకాణాల వద్ద కస్టమర్లు నిరాశలో మునిగారు. మా కుమార్తె వివాహానికి బంగారం కొనాలని వచ్చాం, కానీ రేట్లు ఎక్కువ అని స్టాక్ లేదని చెప్పారు. ఇక నెలల తరబడి ఎదురుచూడడమేనన్నారు!” సంతక్రాంతి మాసం లో సమయంలో ధరలు ఇంత పెరగడం బాధాక రం అంటున్నారు. షాపులు లాభాల కోసం కస్టమ ర్లను మోసం చేస్తున్నాయా?” అని ప్రశ్నిస్తున్నారు. జిల్లా గోల్డ్ ట్రేడర్స్ అసోసియేషన్‌కు చెందిన ఒక యజమాని ప్రకారం, “అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలహీనత, ఇంపోర్ట్ ఖర్చులు పెరగడంతో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పు డు కొత్త స్టాక్ వచ్చే వరకు బుకింగ్ తీసుకోలేక పోతున్నాం అంటున్నారు. కస్టమర్ల అధిక డిమాం డ్‌కు సరిపడా సరఫరా లేదు” అని వివరించారు. పట్టణంలోని పెద్ద షాపుల్లో 22 క్యారెట్ గోల్డ్ గ్రామ్‌ కు ₹7,800 నుంచి ₹8,200 వరకు, 24 క్యారెట్‌కు ₹8,500 పైన టచ్ చేసింది.ఈ పరిస్థితి బంగారం కొనుగోళ్లకు ఆసక్తి కలిగిన మహిళలు, యువత మధ్య చర్చనీయాంశమైంది. కొందరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల వైపు మళ్లిస్తున్నారు, కానీ నాటికీ ధరలు అందరికీ సరిపోకపోవడంతో స్థానిక షాపు లపైనే ఆశలు పెట్టుకున్నారు.ధరలు స్థిరపడే వరకు కస్టమర్లు ఎదురుచూడాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *