వార్త ముఖ్యాంశాలు
- పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10 కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్, వారి ఆదేశాల మేరకు రానున్న అతి భారీ తుఫాను ప్రభావ రీత్యా కాకినాడ జిల్లాలో గల అన్ని ప్రభుత్వ ప్రైవేటు యాజ మాన్యాలలోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 27 నుండి 31 వరకు సెలవు…
- ఎట్టి పరిస్థితులలోనూ తదుపరి సమాచారం ఇచ్చేవరకు ఏ పాఠశాలలను నిర్వహించ రాదు అన్నారు.
- ఉప విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు , ప్రధానోపాధ్యాయులు పాఠశాల యొక్క రికార్డులన్నీ సురక్షితంగా ఉండే విధంగా తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10
కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్, వారి ఆదేశాల మేరకు రానున్న అతి భారీ తుఫాను ప్రభావ రీత్యా కాకినాడ జిల్లాలో గల అన్ని ప్రభుత్వ ప్రైవేటు యాజ మాన్యాలలోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 27 నుండి 31 వరకు సెలవు ప్రకటించారు.
ఎట్టి పరిస్థితులలోనూ తదుపరి సమాచారం ఇచ్చేవరకు ఏ పాఠశాలలను నిర్వహించ రాదు అన్నారు.
ఉప విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు , ప్రధానోపాధ్యాయులు పాఠశాల యొక్క రికార్డులన్నీ సురక్షితంగా ఉండే విధంగా తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండి వారు తుఫాను పునరావాస కేంద్రం నిర్వహణ నిమిత్తము పాఠశాల ఆవరణ కోరినట్లయితే వారికి పాఠశాల తాళాలను అప్పగించ వలసిందిగా ఆదేశించారు.
తుఫాను రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పాఠశాల విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని తెలియ పరచాలన్నారు.
ఉప విద్యాశాఖ అధికారులు , మండల విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి వారి అత్యవసర ఆదేశముల కొరకు నిరంతరం అందుబాటులో ఉండవల సిందిగా ఆదేశించారు.
ప్రధానోపాధ్యాయులు ,మండల విద్యాశాఖ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించ వలసిందిగా కాకినాడ కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్, ఆదేశించారు .